Tuesday, 12 July 2022

వాస్తు ప్రకారం ఒకే రకంగా ఉంటాయా ఒక అపార్ట్ మెంట్ అంతస్థులోని ఫ్లాట్స్ అన్నీ?

ఉండవు ఎప్పటికీ ఒకేలాగా ఎలాగో గమనిద్దాం క్రింద చిత్రాల సహాయముతో

ఒక అంతస్థులో 4 ఫ్లాట్స్ ఉన్నాయి ఉత్తరం మరియు దక్షిణ ముఖము కలిగిమన వాస్తు హౌస్ ప్రకారం భవనము 17° డిగ్రీస్ వంపు తూర్పునకు తిరిగి ఉంది. గమనిద్దాం వంపు తిరిగిన ప్రకారం ఒక దాని తరువాత ఒకటిగా :-

(గమనిక : నేను అన్నీ అంశాలను ఇక్కడ ప్రస్తావించలేను, ప్రధానముగా Toilets, Kitchen, Main Entrance Door Point గురించి మాత్రమే చెప్పటం జరుగుతుంది అది మీ అవగాహన కొరకు)

మొదటి ఫ్లాట్ పైన చూపిన ఉత్తర ముఖము కలిగి ఉన్నాదాని ప్రధాన ప్రవేశ ద్వారం N2 వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం : 

ఈ ద్వారము కలిగి ఉన్న ఇంట్లోని వారికి శత్రువుల భయము, ఇతరులు తమను

చూసి అసూయపడుతున్నారన్న భావనతో ఉంటారు ఎల్లప్పుడూ మరియు 

తటస్థించబడి ఉంటారు.

(మిగతా ప్రవేశ ద్వారాల ఫలితాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోండి Click and Read)

వంటగది (Kitchen) ఈశాన్యములో ఉంటే ఎలా ఉంటుంది అంటే పొయ్యి (అగ్ని) అనేది దూకుడుకి సంకేతము, ఇది చిన్న విషయాలపై తరచుగా వాదనలకు కారణమవుతుంది. 

E5 & E6 లో Toilet వచ్చింది, దీని కారణం చేత సామాజిక సంబందాలు అస్సలు ఉండవు ఈ ఇంటిలోని నివాసితులకు. ఎవ్వరితో మాట్లాడినా కూడా అది కొట్లాటగా మారి మాటలు cut అయిపోతాయి. 

ఇంకొక Toilet S8 & W1 లో వచ్చింది, ఇది కుటుంభ సభ్యుల మధ్యలోనే ఎడమొఖం పెడమొహం పెట్టుకునేలా చేస్తుంది. 

రెండవ ఫ్లాట్ పైన చూపిన ఉత్తర ముఖము కలిగి ఉన్నాదానిని గమనిద్దాం, దాని ప్రధాన ప్రవేశ ద్వారం E2 వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం : 

ఈ ద్వారము స్త్రీ సంతాన యోగమును మరియు చాలా ఎక్కువ వృధా ఖర్చులను ఇస్తుంది.

(మిగతా ప్రవేశ ద్వారాల ఫలితాలు ఎలా ఉంటాయో ఉచితంగా చదువుకొండి Click and Read)

వంటగది (Kitchen) N2, N3, N4 లో ఉంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే భార్య భర్తల మధ్య ఆకర్షణ తగ్గడం మరియు Stove N4 లో ఉండి ఉంటే ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం/రాకపోవడం జరుగుతుంది. 

E8, S1, S2, S3 & S4 Zones లో Toilet వచ్చింది, దీని కారణం చేత చేస్తున్న ఉద్యోగములో గుర్తింపు (Recognition) ఉండదు దానితో ఉన్నత పదవులు వీరికి రానే రావు.

ఇంకొక Toilet వ్యర్ధ స్థానంలోనే వచ్చింది కావున ఎటువంటి ఇబ్బంది ఉండదు.

మూడవ ఫ్లాట్ పైన చూపిన దక్షిణ ముఖము కలిగి ఉన్నదాన్ని గమనిద్దాం, దాని ప్రధాన ప్రవేశ ద్వారం W2 వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం : 

ఈ ప్రవేశం కెరీర్‌లో అస్థిరతను సృష్టిస్తుంది, మరణతుల్య ఇబ్బందులు, సంబంధ బాంధవ్యాలు చెడేలా చేస్తుంది.

(మంచి ప్రవేశ ద్వారాల ఫలితాలు కూడా ఉంటాయి అవి ఏమిటో కూడా చదువుకొండి Click and Read)

వంటగది (Kitchen) SE లో కాకుండా SSE లోనికి వెళ్ళింది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే Liquid Cash Flow అనేది జరగదు, నగదు కొరత ఏర్పడుతుంది, నగదు పుట్టడం కూడా కష్ట తరమవవుద్ది ఈ ఇంటి నివాసితులకు. 

E6, E7 Zones లో Toilet వచ్చింది, దీని కారణం చేత ఈ ఇంటి నివాసితులు ఎప్పుడు ఆలోచనల మీద ఆలోచనలు చేస్తూ ఉంటారు గమనిక : అన్నీ కూడా పనికిరాని ఆలోచనలు. 

ఇంకొక Toilet W8, N1, N2, N3, N4 స్థానాలలో ఉండి కావున వీరికి బ్యాంక్ బ్యాలెన్స్ "0" లో ఉంటుంది, అప్పు పుట్టదు, Loans రావు, ఈ ఇంటి వారి ముఖ కవలికలు ఎవ్వరిని ఎప్పుడు ఆకర్షించే విధంగా ఉండవు, నూతన అవకాశాలు రావటం కష్టం (దాదాపుగా అవకాశాలు రావు)   

చివరి నాలుగవ ఫ్లాట్ పైన చూపిన దక్షిణ ముఖము కలిగి ఉన్నాదానిని గమనిద్దాం, దాని ప్రధాన ప్రవేశ ద్వారం S2 వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం : 

ఈ ప్రవేశ ద్వారం ఇతరుల కోరకు పని చేసే ధోరణిని పెంచుతుంది. MNC లేదా ఇతర వెంచర్లలో పెద్ద ఉద్యోగం ద్వారా ధనరాబడి ఉంటుంది.

(ఇతర 31 ప్రవేశ ద్వారాల ఫలితాలు కూడా ఏమిటో తెలుసుకొండి Click and Read)

వంటగది (Kitchen) S8, W1 & W2 లో ఉంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే దీని ఫలితంగా సంబంధ సమస్యలు ఏర్పడతాయి మరియు వివాహాలు ఆలస్యం అవుతాయి. 

W5 Zone లో Toilet ఉన్నందు వల్ల Profits తగ్గుతూ ఉంటాయి వాళ్ళు చేసే వృత్తి/వ్యాపారంలో. 

ఇంకొక Toilet N8, E1, E2, E3, E4 Zones లో Toilet వచ్చింది, దీని కారణం చేత ధీర్గకాలిక రోగాలు ఉంటాయి, ఎప్పుడు అనారోగ్య పాలు కావడం, డబ్బులు hospitals కే పెట్టడం జరుగుతుంది. 
ఇక్కడ మీరు అందరూ గమనించ వలసిన అంశం ఏమిటి అంటే మనం ఇప్పటి వరకు 17° డిగ్రీస్ వంపు తూర్పునకు తిరిగి ఉన్న దానిని మాత్రమే పరిశీలించాము అదే 17° డిగ్రీస్ కాకుండా 345° పడమర నుంచి 45° డిగ్రీస్ తూర్పు వరకు మధ్యలో చాల డిగ్రీస్ ఉంటాయి అంటే ఊహించుకోండి ఏ ఒక్క గృహం కూడా అన్నీ మంచి విషయాలను కలిగి ఉండదు. (Independent Houses also)

ఇప్పటి వరకు తెలుసుకున్నాము.. 

లక్షలు ఖర్చు చేసి కొనుక్కున్న ఫ్లాట్ లో / ఇండిపెండెంట్ గృహములోఎటువంటి నిర్మాణ మార్పులను చేయకుండా మంచి ఫలితాలను పొందవచ్చు VAASTHU HOUSE REMEDIES (వాస్తు హౌస్ నివారణలను) చేసుకొని. 

మీ కర్నాటి వనిత (వాస్తు కన్సల్టెంట్ & జ్యోతిష్యం)

next

No comments:

Post a Comment

If any query please whatsapp on +91 9949588017