Thursday, 17 November 2022

కార్తీకమాసం అత్యంత పవిత్రమైన మాసం.

                               కార్తీకమాసం అత్యంత పవిత్రమైన మాసం.



#కార్తీకమాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే ప్రతీ ఒక్కటి అత్యంత పవిత్రమైనదిగా ఉండాలి. అదేవిధంగ పూర్వీకులు పెట్టిన నియమాలను పాటించాలి. వీటిలో ప్రధానమైనది స్నానం, దీపం, జపం, దానంతోపాటు కార్తీకపురాణ పఠనం లేదా పారాయణం. దీన్ని పారాయణం చేసి దానిలోని మంచిని గ్రహించి నిత్యజీవితంలో అనుష్టించాలి. ఇదే మన పెద్దలు చెప్పిన విషయం. అయితే కార్తీక పురాణంలో ఏం ఉన్నది ఎన్ని అధ్యాయాలు అంటే.. మొత్తం 30 అధ్యాయాలు. వీటిలో ఏం ఉన్నదో సూక్ష్మంగా తెలుసుకుందాం

 30 అధ్యాయాలు
 1వ అధ్యాయం – కార్తీక మాసం మహత్యం.
 2వ అధ్యాయం – సోమవార వ్రత మహిమ.
 3వ అధ్యాయం – కార్తీక మాస స్నాన మహిమ.
 4వ అధ్యాయం – దీపారాధన మహిమ.
 5వ అధ్యాయం – వనభోజన మహిమ.
 6వ అధ్యాయం – దీపదానవిధి – మహత్యం.
 7వ అధ్యాయం – శివకేశవార్చన విధులు.
 8వ అధ్యాయం – శ్రీహరి నామస్మరణా ధన్యోపాయం.
 9వ అధ్యాయం – విష్ణు పార్శద , యమ దూతల వివాదము.
 10వ అధ్యాయం – అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము.
 11వ అధ్యాయం – మంథరుడు – పురాణ మహిమ.
 12వ అధ్యాయం – ద్వాదశి ప్రశంస.
 13వ అధ్యాయం – కన్యాదాన ఫలము.
 14వ అధ్యాయం – ఆబోతును అచ్చుబోసి వదలుట (వృషోత్సర్గము).
 15వ అధ్యాయం – దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట.
 16వ అధ్యాయం – స్తంభ దీప ప్రశంస.
 17వ అధ్యాయం – అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము.
 18వ అధ్యాయం – సత్కర్మానుష్టాన ఫల ప్రభావము.
 19వ అధ్యాయము – చతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ.
 20వ అధ్యాయము – పురంజయుడు దురాచారుడగుట.
 21వ అధ్యాయము – పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట.
 22వ అధ్యాయము – పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట.
 23వ అధ్యాయము – శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట.
 24వ అధ్యాయము – అంబరీషుని ద్వాదశీవ్రతము.
 25వ అధ్యాయము – దూర్వాసుడు అంబరీషుని శపించుట.
 26వ అధ్యాయము – దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట – శ్రీహరి హితబోధ.
 27వ అధ్యాయము – దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట.
 28వ అధ్యాయము – విష్ణు సుదర్శన చక్ర మహిమ.
 29వ అధ్యాయము – అంబరీషుడు దుర్వాసుని పూజించుట – ద్వాదశి పారణము.
 30వ అధ్యాయము – కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి గురించి తెలియజేస్తాయి.

ప్రతిరోజు ఒక అధ్యాయం చదవడం, స్వామి జపం చేయడం, అధ్యాయంలో చెప్పినవాటిని ఆచరించే ప్రయత్నం చేయడం జీవన్ముక్తికి అత్యంత సులభమైన మార్గాలు.


|| ఓం శ్రీమాత్రేనమః ||

For Updates Follow & Join

ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies

ఫేస్ బుక్ పేజీ Vasthu House

ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha

Vasthu House Blog

Karnati Vanitha Blog

Vasthu House Remedies E-Book

వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Whatsapp +91 7013477841

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Main Entrance Doors & Toilets Located in Right Zone or Not?

Google Route MAP


రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి?

 రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి?


రుత్ అంటే - దుఃఖం ద్రానయతి అని అర్థం. దుఃఖాన్ని నాశనం చేయువాడు రుద్రుడు. వశా అనే ధాతువు నుండీ పుట్టిన శబ్దం శివ ! వశతి అంటేప్రకాశిస్తున్నవాడు అనిఅర్థం. ప్రకాశం అంటేచీకటిని అంతం చేసేది. చీకటి అజ్ఞానానికి రూపమైతేవెలుగు దాని నిరోధకం అంటేజ్ఞానం. జ్ఞానం అంటేమనలో ఉన్న ఆత్మే ! మొత్తంగా మనలోని పరమాత్మ ప్రకాశమే రుద్రుడు.


#కార్తీకమాసం లో మహాన్యాసపూర్వక #రుద్రాభిషేకాలు ఆ పరమేశ్వరునికి విరివిగా చేస్తుంటారు. అయితే, ఈ రుద్రాభిషేకం చేసేందుకు ఒక లెక్కుంది. ఏకాదశ రుద్రాభిషేకం అనేది మనం సాధారణంగా వినేమాటే. కానీ వీటిలో రుద్రం, మహారుద్రం, లఘు రుద్రం, అతి రుద్రంలోతేడాలు ఉన్నాయి. యజుర్వేదంలో మంత్రభాగమైన 11 అనువాకాల'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లుకూడా ఉన్నాయి.

 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లుచెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు. రుద్రం అంటే - నమకం + చమకాలు. వీటిని కలుపుతూ చేసేదే రుద్రాభిషేకం. పదకొండుసార్లు నమకం చేస్తే, ఒక్కసారి చమకం చెప్పాలి. ఈ లెక్కనే, చేసే విధానాన్ని బట్టి, సంఖ్యని బట్టి ఆవృత్తి, రుద్రమని, ఏకాదశ రుద్రమని, శత రుద్రమని, లఘు రుద్రమని, మహా రుద్రమని, అతిరుద్రమని పిలుస్తారు .


1
🌷 వీటిల్లో ఆవృత్తి – నమకం 121 సార్లు, చమకం 11 సార్లు చెప్పితే ఆవృత్తి అంటారు.
2
🌷 రుద్రం- నమకం 1331 సార్లు, చమకం  121 సార్లు
3
🌷 ఏకాదశ రుద్రం- నమకం 14,641 సార్లు, చమకం-1331 సార్లు
4
🌷 శతరుద్రం- నమకం 1,61,051 సార్లు,చమకం 14,641 సార్లు
5
🌷 లఘురుద్రం- నమకం 17,71,561 సార్లు, చమకం- 1,61,051 సార్లు
6
🌷 మహారుద్రం- నమకం 1,94,87,171 సార్లు, చమకం- 17,71,561 సార్లు
7
🌷 అతిరుద్రం- నమకం 21,43,58,881 సార్లు, చమకం -1,94,87,171 సార్లు

ఈ రుద్ర మంత్రాలను అభిషేకానికి వాడితే '#రుద్రాభిషేకం', హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు పరమాత్మ లోనికి ఐక్యం చెందుతాడు.

|| ఓం శ్రీమాత్రేనమః ||

For Updates Follow & Join

ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies

ఫేస్ బుక్ పేజీ Vasthu House

ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha

Vasthu House Blog

Karnati Vanitha Blog

Vasthu House Remedies E-Book

వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Whatsapp +91 7013477841

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Main Entrance Doors & Toilets Located in Right Zone or Not?

Google Route MAP