రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి?
#కార్తీకమాసం లో మహాన్యాసపూర్వక #రుద్రాభిషేకాలు ఆ పరమేశ్వరునికి విరివిగా చేస్తుంటారు. అయితే, ఈ రుద్రాభిషేకం చేసేందుకు ఒక లెక్కుంది. ఏకాదశ రుద్రాభిషేకం అనేది మనం సాధారణంగా వినేమాటే. కానీ వీటిలో రుద్రం, మహారుద్రం, లఘు రుద్రం, అతి రుద్రంలోతేడాలు ఉన్నాయి. యజుర్వేదంలో మంత్రభాగమైన 11 అనువాకాల'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లుకూడా ఉన్నాయి.
ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లుచెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు. రుద్రం అంటే - నమకం + చమకాలు. వీటిని కలుపుతూ చేసేదే రుద్రాభిషేకం. పదకొండుసార్లు నమకం చేస్తే, ఒక్కసారి చమకం చెప్పాలి. ఈ లెక్కనే, చేసే విధానాన్ని బట్టి, సంఖ్యని బట్టి ఆవృత్తి, రుద్రమని, ఏకాదశ రుద్రమని, శత రుద్రమని, లఘు రుద్రమని, మహా రుద్రమని, అతిరుద్రమని పిలుస్తారు .
1 వీటిల్లో ఆవృత్తి – నమకం 121 సార్లు, చమకం 11 సార్లు చెప్పితే ఆవృత్తి అంటారు.
2 రుద్రం- నమకం 1331 సార్లు, చమకం – 121 సార్లు
3 ఏకాదశ రుద్రం- నమకం 14,641 సార్లు, చమకం-1331 సార్లు
4 శతరుద్రం- నమకం 1,61,051 సార్లు,చమకం 14,641 సార్లు
5 లఘురుద్రం- నమకం 17,71,561 సార్లు, చమకం- 1,61,051 సార్లు
6 మహారుద్రం- నమకం 1,94,87,171 సార్లు, చమకం- 17,71,561 సార్లు
7 అతిరుద్రం- నమకం 21,43,58,881 సార్లు, చమకం -1,94,87,171 సార్లు
ఈ రుద్ర మంత్రాలను అభిషేకానికి వాడితే '#రుద్రాభిషేకం', హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు పరమాత్మ లోనికి ఐక్యం చెందుతాడు.
|| ఓం శ్రీమాత్రేనమః ||
For Updates Follow & Join
ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies
ఫేస్ బుక్ పేజీ Vasthu House
ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha
వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం
ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము & టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?
No comments:
Post a Comment
If any query please whatsapp on +91 9949588017